FLASH : కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కి కరోనా..! సీఎం కేసీఆర్, సీఎం జగన్ సమావేశం రద్దు..?

-

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ఈ మహమ్మారి బారిన పడ్డారు.

 

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే గత కొన్ని రోజులుగా ఆయనని కలిసిన వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇకపోతే ఈ నెల 25 న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ప‌రిష్కారానికి నోచుకోని జ‌ల‌వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌డానికి రంగంలోకి దిగిన కేంద్ర ప్ర‌భుత్వం వారితో చర్చించనుంది. సీఎం కేసీఆర్, సీఎం జగన్ లతో ఈ విషయమై కేంద్ర జలశక్తి వనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చర్చించనున్నారు. అయితే ఆయన కరోనా బారిన పడడంతో ఈ సమావేశం రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version