నో పాలిటిక్స్: కిషన్ రెడ్డి సూచనలు బాగున్నాయంట… టి.నేతలు పాటిస్తారా?

-

ఢిల్లీలో బీజేపీ – తెరాస కలిసిఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతుంటారు.. కానీ తెలంగాణ విషయానికొచ్చే సరికి బీజేపీ పరిపూర్ణమైన ప్రతిపక్షపాత్ర పోషిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా తెలంగాణ మంత్రులపైనా, సర్కార్ పనితీరుపైనా బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. తెరాస నేతలకు సూచనలతో కూడిన చురకలు అంటించారు!


తెలంగాణలో గతకొన్ని రోజులుగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తెరాస సర్కార్ పై ఇంతకాలం ఎన్నడూ రానంత తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, హోమం మినిస్టర్ తో సహా తెలంగాణలోని చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. ఈ క్రమంలో వీరంతా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయాలపైనే కిషన్ రెడ్డి స్పందించారు.

వైరస్ చికిత్స కోసం ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి వస్తుంటే… మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇక నుంచి పాజిటివ్ వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాలని.. ఇందులో భాగంగా గచ్చిబౌలి టిమ్స్ ను వెంటనే ప్రారంభించి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు!

ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో టెస్టులు తక్కువగా జరుగుతున్నాయన్న కిషన్ రెడ్డి… కేంద్రం నుంచి తెలంగాణకు ఇప్పటికె 600 వెంటిలేటర్లు పంపించినట్లు వివరించారు. ఇప్పటికే గాంధీలో 250కి పైగా వెంటిలేటర్లు ఖాళీగా ఉన్నా కూడా… ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడం.. ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వడమో ఆలోచించుకోవాలని. కిషన్ రెడ్డి సూచించారు!

ఇలా కిషన్ రెడ్డి చేసిన సూచనలు కం చురకలతో తెలంగాణ ఎమ్మెల్యేలు, తెరాస మంత్రులు స్పందిస్తారా.. లేక ప్రభుత్వ ఆసుపత్రులపై తమకు ఇంతే నమ్మకం ఉందని ప్రైవేటు ఆసుపత్రుల వెంటే పడతారా అనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version