తెలుగు ప్రజలకు కేంద్రమంత్రుల భోగి శుభాకాంక్షలు..

-

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలు, పతంగుల కోలాహలం, తెలుగుదనంతో నిండిన ఈ సంక్రాంతి అందరికీ శుభం చేకూర్చాలని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు” అని రాసుకొచ్చారు.

ఇక ఈ భోగి పండుగ మీకు భోగ భాగ్యాలను అందించాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ‘మీ వాంఛితాలన్నీ తీరి అత్యున్నత భోగాలు మీ సొంతం కావాలని ప్రాకృతిక మార్పులతో సూర్య సంక్రమణ వేళ పీడలన్నీ వదిలి సర్వం భోగ మయం కావాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ హిందూ బంధువులకు భోగి పండుగ శుభాకాంక్షలు” అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version