ట్రేడింగ్ పేరుతో మరో భారీ మోసం.. రూ.24 లక్షలు స్వాహా..

-

సైబర్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. చదువుకుని, చదువుకోని వారు సైతం ఈ సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఏదైనా లింక్ క్లిక్ చేసినా, క్యూఆర్ కోడ్స్, ట్రేడింగ్‌లో అధిక లాభాల పేరిట పెట్టుబడులు పెట్టించి మరీ దోచేస్తున్నారు. మరికొందరు బ్యాంకులో ఈ కేవైసీ, ఆధార్ పాన్ లింకు పేరిట కూడా మోసాలకు పాల్పడుతున్నారు.

తాజాగా సంగారెడ్డి జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. పట్టణంలో నివసించే దుగ్గిరెడ్డికి ఓ సైబర్ నేరగాడు కాల్ చేశారు. తమ వద్ద ట్రేడింగ్‌‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికాడు.మొదట లాభాలు చూపించిన సైబర్ మోసగాడు..దుగ్గిరెడ్డి అకౌంట్ నుంచి రూ.24 లక్షలను తన అకౌంట్‌కు బదిలీ చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు న్యాయం చేయాలంటూ స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version