Shreyas Iyer appointed Punjab Kings captain for IPL 2025: పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ నియమించింది ఆ జట్టు యజమాన్యం. పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ పేరును ఫైనల్ చేసింది. మొన్నటి మెగా వేలంలో 26 కోట్లకు పైగా డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్… శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ చేయడం జరిగింది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నుంచి… పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నారు శ్రేయస్ అయ్యర్.
2024 ఐపీఎల్ టోర్నమెంట్లో.. కేకేఆర్ జట్టు కెప్టెన్గా వ్యవహరించారు శ్రేయస్ అయ్యర్. ఆ సమయంలో ఆ జట్టును చాంపియన్గా నిలిపాడు శ్రేయస్ అయ్యర్. అయితే ఇప్పుడు పంజాబ్ జట్టు కెప్టెన్ గా కొనసాగనున్నాడు అయ్యర్. దీంతో 17 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్… కప్పు గెలవడం గ్యారెంటీ అంటున్నారు.