ప్రపంచంలో అగ్రదేశాలు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలే కరోనా వైరస్ ముందు కరిగిపోతున్నాయి. వైరస్ ప్రమాదాన్ని అరికట్టలేక జనాలను కంట్రోల్ చేయలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో కరుణ పాజిటివ్ కేసుల సంఖ్య మరణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇటువంటి తరుణంలో ఇండియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా 21 రోజుల పాటు షట్ డౌన్ ప్రకటించడం జరిగింది. చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా కఠినంగా అమలు చేస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
వలసలను అడ్డుకునేందుకు ఎవరైనా పట్టణాల సరిహద్దులు దాటి బయటికి వెళ్ళిన దానికి బాధ్యులు కలెక్టర్లు మరియు ఎస్పీలు అని వాళ్ళ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆదేశించారు. భోజన వసతి అదేవిధంగా షెల్టర్ రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి అంటూ ఇటీవల సూచించారు. ముఖ్యంగా కరోనా వైరస్ గుంపులుగా వెళ్ళే వాళ్ళల్లో ఓ నలుగురికి సోకినా అది వందలమందికి సోకే అవకాశం ఉండటంతో రాబోయే రోజుల్లో…దీనిని నియంత్రించడానికి కేంద్రం మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.