ఆ త‌ల్లీ కూతుళ్లు వైసీపీ ఎంట్రీ వెన‌క‌ ఒప్పందం ఇదేనా..?  వైసీపీలో చ‌ర్చ‌

-

రాజ‌కీయాల్లో నాయ‌కులు సొంత లాభం వ‌దులు కోవ‌డం అంటే అంత ఈజీకాదు. గ‌తంలో మాదిరిగా సొం త ఆస్తుల‌ను ప్ర‌జ‌ల‌కు పంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య‌లను ఇప్పుడు కూడా ఆశిం చ‌డం అంటే.. మ‌నం క‌లికాలంలో ఉన్నామ‌నే విష‌యాన్ని మ‌రిచిపోయిన‌ట్టుగానే భావించాలి. సో.. స్వ‌లా భం లేని రాజ‌కీయాలంటే.. మొద‌లు చెడ్డ బేరంకిందే లెక్క‌! ఎవ‌రైనా ఎప్పుడైనా ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి వ‌చ్చార‌న్నా.. ఒక పార్టీని విమ‌ర్శించార‌న్నా.. అంతా ప‌క్కా బిజినెస్ అనే చెప్పాలి. అలాంటిది దాదాపు 30 ఏళ్ల రాజ‌కీయ అనుబంధాన్ని తృటిలో తెంచుకోవ‌డం అంటే.. ఎంత ల‌బ్ధి ఉండాలి?

ఇప్పుడు ఇలాంటి విష‌య‌మే అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల‌లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్సీ వ‌ర్గానికి చెందిన శ‌మంత‌క‌మ‌ణి, ఆమె కుమార్తె యామినీ బాల‌లు రాజ‌కీయాల్లో సిద్ధ హ‌స్తులు. గ‌డిచి న 30 ఏళ్లుగా శ‌మంత‌క‌మ‌ణి రాజ‌కీయాల్లోనే ఉన్నారు. దివంగ‌త ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా రాజ‌కీ యాలు చేస్తున్నారు. ఇక‌, తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూర‌మై.. త‌న కుమార్తెను రంగంలోకి దింపారు.

యామినీ బాల కూడా శింగ‌న‌మ‌ల నుంచి విజ‌యం సాధించారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విప్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. మంత్రి ప‌ద‌విని ఆశించినా కూడా ల‌భించ‌లేదు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టికెట్ ల‌భించ‌క‌పోవ‌డం, టీడీపీ నుంచి స‌రైన ఆద‌ర‌ణ‌లేద‌ని భావించ‌డంతో  పార్టీ మారిపోయారు. అయితే, ఊర‌క‌రారు మ‌హానుభావులు అన్న‌ట్టుగా వైసీపీలోకి వ‌చ్చిన నేప‌థ్యం వెనుక కూడా శ‌మంత‌క‌మ‌ణి పెద్ద వ్యూహంతోనే వ‌చ్చార‌ని ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చించుకుంటున్నారు. మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఏపీలో రాజ్య‌స‌భ సీట్లు ఖాళీ అవుతున్నాయ‌ని, వీటిలో ఒక‌టి త‌మ‌కు కేటాయించాల ని జ‌గ‌న్‌ను కోరార‌ట‌.

అదే స‌మ‌యంలో ఏపీ మ‌హిళా క‌మిష‌న్‌లో యామినీ బాల‌కు చోటు క‌ల్పించాల‌ని కూడా అభ్య‌ర్థించార‌ట‌. వీటిని ప‌రిశీలిస్తాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డంతో ఆయ‌న‌పై న‌మ్మ‌కంతోనే వారు ఇరువురు కూడా పార్టీ మారిపోయార‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ప‌రిశీలిస్తాన‌ని అన్నారంటే.. ఇక జ‌రిగిపోయిన‌ట్టే న‌ని వైసీపీలో ప్ర‌చారంలో ఉన్న నేప‌థ్యంలో ఈ త‌ల్లీ కూతుళ్ల‌కు మంచి ఆఫ‌ర్లు ద‌క్కుతాయ‌ని అంటున్నా రు.

Read more RELATED
Recommended to you

Exit mobile version