ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ నేతలు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పియూష్ గోయల్ తెలంగాణ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తుందని విమర్శించారు. రైతులతో రాజకీయ చేస్తుందన్నారు. తెలంగాణలో గత ఐదేళ్లలో ధాన్యం సేకరణను 3 రెట్లు పెంచామని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సార్లు ఎక్స్ టెన్షన్ ఇచ్చామని తెలిపారు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వ రబీ ధాన్యాన్ని డెలవరీ చేయలేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.- పియూష్ గోయల్
-