జనం మీద పెట్రో ఎటాక్ ?.. కేంద్రం ప్లాన్ అదేనా !

-

కేంద్రం మళ్ళీ జనాల నడ్డి విరవడానికి రెడీ అవుతోంది. పెట్రో ధరలు మరో సారి భగ్గు మనబోతున్నట్టుగా అంచనాలు వెలువడుతున్నాయి. కరోనా దెబ్బకు ఇప్పటికే రకరకాల ఇబ్బందులు పడుతున్న కేంద్ర ప్రభుత్వం అదనపు ఆదాయ మార్గాలను వెదుకుతోంది. అందుకే పెట్రో దిగుమతుల మీద ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచే యోచనలో ఉంది.

పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు 3 నుంచి 6 రూపాయల భారం మోపే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచాలని చూస్తోందని సమాచారం. ఖజానాకు 60 వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే పెట్రో ఉత్పత్తుల మీద అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఇప్పటికే మొదటి స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version