నిరుపేదలకు కేంద్రం తీపికబురు..ఉజ్వలపై మరో ఏడాది రాయితీ

-

నిరుపేదలకు కేంద్రం తీపికబురు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న రూ.200 రాయితీని మరో ఏడాది పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఏటా 12 గ్యాస్ సిలిండర్ల వరకు ఒక్కోడానికి రూ. 200 చొప్పున రాయితీ వస్తోంది.

gas cylinder

అలాగే ముడి జనాపనార కనీసం మద్దతు ధరను రూ. 4750 నుంచి రూ.5050కు కేంద్రం పెంచగా, దీని ద్వారా 40 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నట్లు కేబినెట్ అంచనా వేసింది. ఇక అటు ఉపాధి హామీ వేతనాలను కేంద్రం రూ.15 మేర పెంచింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో AP, TS రూ. 257 గా ఉన్న కూలీ రూ.272 కు చేరింది. అత్యధికంగా హర్యానాలో రూ. 357, కేరళలో రూ. 333, గోవాలో రూ. 322, కర్ణాటకలో రూ. 316, లక్షద్వీప్ లో రూ. 304, పంజాబ్ లో రూ. 303, పుదుచ్చేరి, తమిళనాడులో రూ. 294 కూలీ దక్కనుంది. అన్ని రాష్ట్రాల్లో సమాన వేతనాలు అమలు చేయాలన్న స్థాయి సంఘం నివేదికను కేంద్రం పట్టించుకోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version