ప్రొసిజర్‌ ప్రకరామే ఫలితాలు వెల్లడి : ఈసీ

-

మునుగోడు ఉప ఎన్నికలో ఫలితాలు వెల్లడిలో జాప్యం జరుగుతోందని బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌ మాట్లాడుతూ.. ఫలితాల వెల్లడికి ఒక ప్రొసిజర్‌ ఉంటుందని, ఆ ప్రొసిజర్‌ ప్రకారమే ఫలితాలు వెల్లడిస్తున్నామన్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందుకే కౌంటింగ్‌ ఆలస్యమవుతుందని ఆయన వివరించారు. కౌంటింగ్‌ పారదర్శకంగా జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రతీ టేబుల్‌ దగ్గర అభ్యర్థుల ఏజెంట్లు ఉన్నారని ఆయన వెల్లడించారు వికాస్‌ రాజ్‌. ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరుపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. నేటి ఉదయం మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే… 11 గంటల సమయానికంతా 4 రౌండ్ల ఓట్ల లెక్కింపు మాత్రమే పూర్తి అయ్యింది.

ఈ క్రమంలో ఓట్ల లెక్కింపులో ఆయా రౌండ్లలో వచ్చిన ఫలితాలను విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని బీజేపీ ఆరోపించింది. ఈ దిశగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ ఆధిక్యం కనబరచిన రౌండ్ల ఫలితాలను అప్పటికప్పుడే వెల్లడిస్తున్న అధికారులు… బీజేపీ ఆధిక్యం సాధించిన రౌండ్ల ఫలితాలను మాత్రం ఆలస్యంగా విడుదల చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఆధిక్యం సాధించిన రౌండ్ల ఫలితాలను వెల్లడించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version