అమరావతి: గ్రామ కంఠ భూములపై ఏపీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. గ్రామ కంఠాల్లో ఖాళీగా ఉన్న ఇల్లు, స్థలాలకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూరక్ష’ పథకంలో భాగంగా వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి గ్రామ కంఠ ఆస్తులకు సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. మొత్తం 25 వేల గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే 753 గ్రామాల్లో సర్వేను పూర్తి చేశారు. 241 గ్రామాల్లో ఈ స్థలాలను గుర్తించి మార్క్ చేశారు. అంతేకాదు వీటికి ప్రత్యేకమైన నెంబర్లు కేటాయించారు.