ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ పైనే ఆధారపడి ఉంది. రోజు రోజుకి కొత్త టెక్నాలజీ పరంగా కొత్త పుంతలు తొక్కుతూ దూసుకుపోతోంది. దీనికి ప్రధాన కారణం ఐటీ నిపుణులు. వీరిని టెకీలుగా కూడా పిలుస్తారు. వీరి ఆలోచనల నుంచీ రూపు దిద్దుకున్న ఎన్నో పరికరాలు , ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ ఫోన్స్, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా హోటల్స్ లో సర్వర్స్ గా రోబోలని సైతం వాడుతున్నారంటే ఇది కేవలం ఐటీ ప్రొఫిషనల్స్ పుణ్యమే..అయితే
ఇంతటి అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన టెకీ లు అందరూ ఒక్కచోట చేరి తమ భవిష్యత్తు ఆలోచనలకి కార్యరూపం ఇస్తే. ఆ సంఘటన ఊహించడానికే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఫ్యూచర్ షో ని అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత టెకీలు ఏర్పాటు చేస్తున్నారు. లాస్ వేగాస్ లో ప్రతీ ఏడాది నిర్వహించే కన్జ్యూమర్స్ టెక్ షో ని ఈ ఏడాది కూడా ఏర్పాటు చేయనున్నారు.
CES 2020 పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ షో జనవరి 7 నుంచి 10 వరకు జరగనున్నదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షో 53వది. ఇందులో సుమారు 4500 ప్రముఖ కంపెనీలు , స్టార్టప్ కంపనీలు వారి నూతన ఉత్పత్తులని ప్రదర్శించబోతున్నాయి. లక్ష 75 వేల మంది జనం ఈ షో లో పాల్గొంటున్నారని తెలిసింది. ఇక్కడ మరొక విశేషం ఏమింటే..ఇప్పటి వరకూ మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్స్, టీవీలు, గాడ్జెట్స్ కన్నా కూడా ఇవి టెక్నాలజీ రాబోతున్నాయట.