బిగ్‌బాస్ సీజన్-8లో చైన్ టాస్క్..బాడీ ఐతే ఏంటి అంటూ గొడవలకు దిగిన కంటెస్టెంట్లు!

-

బిగ్‌బాస్ సీజన్-8లో కంటెస్టెంట్ల తీరు ఏమాత్రం మారడం లేదు. షో ప్రారంభం నాటి నుంచి ఇలానే గొడవ పడుతూనే ఉన్నారు.14 మంది కంటెస్టెంట్లు ఈ సీజన్‌లో ఎంట్రీ ఇవ్వగా..అందులో పెద్దగా మొహాలు ఎవ్వరూ లేకపోవడం గమనార్హం. యాంకర్ విష్ణుప్రియ, ఆర్జే శేఖర్ బాషా, 7ఆర్ట్స్ సీత మినహా అన్ని కొత్త మొహాలే ఉన్నాయి. దీంతో ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయని, షో రేటింగ్స్ పెంచుకునే పనిలో బిగ్ బాస్ నిర్వహకులు ఉన్నట్లు సమాచారం. అయితే, హోస్ట్ నారార్జున ఈ విషయాన్ని గుట్టుగా ఉంచినట్లు అభిమానులు నెట్టింట చర్చ జరుపుతున్నారు.

బిగ్‌బాస్ షో ప్రారంభమై నాలుగో రోజున కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ చైన్ టాస్కు ఇచ్చాడు. దీనిలో టీమ్ సభ్యులను రెండు జట్లుగా విడగొట్టారు. నిఖిల్ చీఫ్ హోదాలో ఉండి సభ్యులు చేసే టాస్కును పర్యవేక్షించాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక బేబక్క ఈ టాస్క్‌ లో పాల్గొనలేదు. విష్ణుప్రియ ఒక టీములో ఉండగా.. శేఖర్ బాషా వేరే టీములో ఉన్నారు. వీరికి రింగులు ఇచ్చిన బిగ్‌బాస్ వాటిని నేల మీద పడకుండా బాడీల మీద నుంచి ఒకరినొకరు పాస్ చేసుకుని కింద పడేయాలని టాస్క్ ఇచ్చాడు. అయితే, కంటెస్టెంట్లు టాస్క్ ఫినిష్ చేశాక విష్ణుప్రియ ఉన్న టీం సభ్యులు మెడ మీద నుంచి రింగ్ పడవేసి టాస్క్ ఫినిష్ చేయగా అది తప్పు అని నిఖిల్ వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ టీములోని సభ్యులు కూడా నిఖిల్ జడ్జిమెంట్‌ను తప్పుబట్టారు. ఇలా గొడవల మధ్యే బిగ్‌బాస్ సీజన్ -8 కొనసాగుతోంది. అయితే, ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version