అంతా నేనే చేశా?…చంద్రబాబు

-

తెలంగాణను అన్ని విషయాల్లో అభివృద్ధి చేసింది తానేనని మరోసారి చంద్రబాబు తన బాజా మోగించారు. కూకట్‌పల్లిలో ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్‌ ఈ గడ్డపైనే తెదేపాని స్థాపించారు…తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఎన్టీఆర్ ఆత్మగౌరాన్ని అందిస్తే..నేను ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించానన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ దక్కని గౌరవం నాకు ఆదక్కింది. మన హైదరాబాద్‌కు అక్కడ అహ్మదాబాద్‌కు ఏమైనా పోలిక ఉందా..? హైటెక్‌ సిటీతో ప్రారంభమైన అభివృద్ధితో ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చాం. నేను హైదరాబాద్ని నిర్మించానని ఎప్పుడూ చెప్పలేదు..నేను  సైబరాబాద్‌ ని నిర్మించానని గొప్పగా చెప్పుకుంటున్నా అన్నారు. సైబరాబాద్  నా మానసపుత్రిక అన్నారు.

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఫ్లైఓవర్‌ కట్టారా..? హైటెక్‌ సిటీ, సైబరాబాద్‌, ఫైనాన్షియల్‌ సిటీ, ఎయిర్‌పోర్టు వంటివి తీసుకొచ్చాను. కేసీఆర్‌ నాలుగున్నర ఏళ్లలో ఏం చేశారు. ప్రగతి భవన్‌, ఫాంహౌస్‌ కట్టుకున్నారు’’ అని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో వృద్ధి 10శాతం ఉంటే మోదీ హయాంలో 6శాతానికి పడిపోయింది. మోదీ తెలుగు జాతికి ద్రోహం చేశారు. తెలంగాణకు వరంగల్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, గిరిజన‌ వర్సిటీ, ఐటీఐఆర్‌ ఇస్తామన్నారు.. ఇచ్చారా? తెరాస వారు అడిగారా? నాకు పరిపక్వత లేదంట.. కేసీఆర్‌కు ఎక్కువ ఉందంట అని పేర్కొన్నారు. ఒక్క సారి ఆలోచించండి అంటూ కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version