మేమిద్దరం అందుకే కలిశాం…

-

దేశ వ్యాప్తంగా భాజపా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నేడు ప్రముఖులను కలిశారు. వీరిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంద్రబాబు కలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు గంట‌కు పైగా రాహుల్ గాంధీతో చంద్ర‌బాబు చ‌ర్చ‌లు జరిపారు అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడుతూ… దేశ భవిష్య‌త్ కోసమే కలిసి పనిచేయాలని నిర్ణ‌యించామన్నారు.. గ‌తాన్ని వ‌దిలేసి భ‌విష్య‌త్ కోసం కృషి చేస్తామ‌ని రాహుల్ గాంధీ వివరించారు. రాఫెల్ వ్య‌వ‌హారంలో ముమ్మాటికి అవినీతి జ‌రిగింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదని రాహుల్ తెలిపారు. రాఫెల్ కుంభకోణంపై విచారణకు సిద్ధమవుతున్న సీబీఐని ఇటీవలే వారు బెదిరించిన సంగతి తెలిసిందే. వీటికి తోడు ఆర్బీఐపై కేంద్రం పెత్తనాన్ని సైతం ఆయన ప్రస్తావించారు.

అనంత‌రం ఏపి సిఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ…దేశాన్ని, ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించాల‌నే రాహుల్ గాంధీతో క‌లిశాన‌ని, భాజపా వ్య‌తిరేక ప‌క్షాల‌న్నింటినీ ఏక‌తాటిపైకి తీసుకొస్తామ‌ని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిందన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి కూడా రాహుల్‌ మద్దతిచ్చారని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరగా.. అందుకు ఆయన అంగీకరించారని వెల్లడించారు. రాఫేల్‌ పోరాటాన్నిరాహుల్‌ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Latest news