రెండు రోజుల క్రితం అదృశ్యమైన గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీఎల్‌ఎఫ్ అభ్యర్థి చంద్రముఖి మిస్టరీ వీడింది. చంద్రముఖి తల్లి అనిత హైకోర్టు తన కూతురు కనపడటం లేదంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో గురువారం ఉదయం పదిగంటలకు చంద్ర ముఖిని హాజరుపర్చాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలిచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆమె తన లాయర్ పాటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారని ఇన్‌స్పెక్టర్ గోవింద్ రెడ్డి తెలిపారు. అసలు ఏం జరిగిందంటే.. బంజారాహిల్స్‌లో నివసించే చంద్రముఖి మంగళవారం ఉదయం 8గంటల ప్రాంతంలో ఇంటివద్ద నుంచి అదృశ్యమయ్యారు.
తర్వాత ఆమె ఎక్కడికివెళ్లారు, ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా? అనే కోణంలో అయితే ఒకపక్క టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మరోపక్క పోలీసులు అన్ని ప్రాంతాల్లో ఆమె జాడకోసం ఆరా తీస్తుండగానే రాత్రి 11గంటల తర్వాత చంద్రముఖి బంజారాహిల్స్ పోలిస్‌స్టేషన్‌కు వచ్చారని తెలిపారు. అయితే తాను అదృశ్యమైన ఘటనకు సంబంధించి వివరాలు చెప్పటం లేదని, ఏదో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్టుగా కనిపిస్తున్నారని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. ఈ అదృశ్యం వెనుక ఎవరు ఉన్నారు’? అన్న సస్పెన్స్‌కు మాత్రం తెరపడలేదు. చంద్రముఖి స్వయంగా వివరాలు చెబితేనే…దీని వెనుక ఉన్న వారెవరో తెలుస్తుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.