తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి వెళ్లడంపై తుది నిర్ణయం తెలంగాణ నేతలదేనని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో పార్టీ ఉండటం చారిత్రక అవసరం, నేతలు కష్టపడి సమిష్టిగా పనిచేయాలని కోరారు. ప్రజల అభిప్రాయం ప్రకారం పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ తో పొత్తు అవసరమైతే స్థానిక నేతలే ప్రచారం చేసుకోవాలని వారికి తెలిపారు. అండగా నేనుంటా అంటూ వారికి భరోసా
ఇచ్చారు. భాజపా విధానాలు తెలుగు రాష్ట్రాల వల్ల తెలుగు రాష్ట్రాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు.
సీఎం హోదాలో ఉన్నాను కాబట్టి ఎన్నికల్లో ప్రచారం చేయడం సరికాదని నేతలకు తెలిపారు. చంద్రశేఖర్ రావుకి నాకు గొడవ పెట్టాలని కేంద్రం ప్రయత్నించిందని గుర్తుచేస్తూ..భాజపాకి వ్యతిరేకంగా పోరాడాలని నాయకులకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.