ఏపీని పునర్ నిర్మాణం చేయాలి – చంద్రబాబు

-

ఏపీని పునర్ నిర్మాణం చేయాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్ర పునర్ నిర్మాణం కోరుకునే ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని… పార్టీ సభ్యత్వం తీసుకోకుండా తటస్థులుగా ఉండేవారు సభ్యత్వానికి సహకరించాలని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తటస్థులు.. మేధావులు కూడా టీడీపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని… భారతీ సిమెంట్స్ ద్వారా జగన్ వేల కోట్లు వెనకేసుకుంటున్నారు.. భవన నిర్మాణ కార్మికులకు మాత్రం పని ఉండడం లేదని వెల్లడించారు.

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వంలో ఉండగా ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేశాం.. కానీ ఈ ప్రభుత్వం దాన్నీ మింగేసిందని నిప్పులు చెరిగారు. తాజాగా భారతీ సిమెంట్స్ ధరలు పెంచారని.. భారతీ సిమెంట్స్ ధరలు పెంచడమే కాకుండా.. అన్ని కంపెనీలను సిండికేట్ చేసి సిమెంట్ తక్కువ ధరకు రాకుండా చేస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

దొపిడీ కోసం ఇసుకకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని.. రూ. 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు.. ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం కన్పించడం లేదని పేర్కొన్నారు. ఆత్మస్థైర్యం కొల్పోయి రైతులు ఉరేసుకోవడం కాజు.. ఈ ప్రభుత్వాన్ని ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. నేనొక్కడినో.. ఒక్క టీడీపీనో ప్రభుత్వంపై పోరాటం చేస్తే సరిపోదు.. ప్రజల్లోనూ అవగాహన రావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version