ఏపీ పేదలకు అలర్ట్..నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. సంక్రాంతి పండుగ తర్వాత.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా జరుగనుంది. ముఖ్యంగా జగన్ ఫోటోలతో ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా జరుగనుందని సమాచారం.
అలాగే.. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది చంద్రబాబు కూటమి సర్కార్. ఇది ఇలా ఉండగా..డిసెంబర్ 4న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం 3కి మార్పు జరిగింది. దీంతో ఈనెల 3న అంటే రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇలాంటి తరుణం లోనే.. ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.