కాపులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వివాదాస్పద వ్యాఖ్యలు..కాపోడు అంటూ !

-

కాపులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాపోడు అంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడారు. సమాజంలో ఒక రెడ్డి కారు కొంటే గారు బ్రహ్మాండమైన కారు కొన్నారంటారని… ఒక చౌదరి ఇల్లు కడితే చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టారని చెప్పుకుంటారని పేర్కొన్నారు. కానీ కాపోడు స్కూటర్ పై వెళ్తుంటే ఎక్కడ కొట్టుకొచ్చాడని అంటుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.

Thota Trimurthulu comments on ap kapulu

ఇది కాపులు సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. కాపు సంఘం మీటింగులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎదిగే కాపులను కిందకు లాగవద్దని కోరారు. కాపులను ఎవరు పైకి తీసుకురారు.. వారికి వారే ఎదగాలని తెలిపారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఇక ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసిన కామెంట్స్‌ పై రెడ్డి, చౌదరి వర్గీయులు ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news