వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపి అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పం టార్గెట్‌గా ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయో అందరికీ తెలిసిందే. కుప్పంలో వైసీపీ…చంద్రబాబుకు చుక్కలు చూపించేస్తుంది. ఎలాగైనా బాబు కంచుకోటని వైసీపీ పరం చేయాలని చెప్పి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో కూడా తెలిసిందే.
అయితే ఇవే కాదు..త్వరలోనే కుప్పంలో చంద్రబాబు మరో ఘొరం చూడబోతున్నారని చెప్పొచ్చు. జగన్ ప్రభుత్వం…కుప్పం మేజర్ పంచాయితీని…నగర పంచాయితీగా అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. కుప్పం మండలంలోని ఎనిమిది పంచాయతీలు, గుడుపల్లె మండలంలోని మరో మూడు పంచాయతీలు కలిపి కుప్పం నగర పంచాయితీగా ఏర్పడింది. అయితే దీనికి ఎన్నిక జరగలేదు. ఇక త్వరలోనే వాయిదా పడిన కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం రెడీ అవుతుంది.
ఎన్నికలు జరిగే కుప్పం నగర పంచాయితీలో కూడా టిడిపికి ఘోర ఓటమి తప్పేలా లేదు. కాబట్టి బాబు ఇప్పటికైనా అలెర్ట్ అయ్యి…కుప్పంలో టిడిపిని బలోపేతం చేయాల్సిన అవసరముంది. అలాగే టిడిపిలో ఉంటూ సొంత పార్టీనే నాశనం చేస్తున్నవారిని సైడ్ చేయాలి. ప్రజలకు తాను అండగా ఉంటాననే చంద్రబాబు మరోసారి నిరూపించుకోవాలి. అలా కాకుండా మళ్ళీ బాబు లైట్ తీసుకుంటే…కుప్పం నియోజకవర్గాన్ని కూడా లైట్ తీసుకోవాల్సిందే.