Yuvraj Singh Biopic: మరో క్రికెటర్ బయోపిక్.. కరణ్ జోహార్ సన్నాహాలు

-

Yuvraj Singh Biopic: ఇండస్ట్రీలో బయోపిక్స్ హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా,రాజకీయ ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్స్ తెర‌కెక్కాయి. అయితే.. వాటిలో స్పోర్ట్‌ స్టార్స్ బయోపిక్స్‌కు మంచి ఆదార‌ణ ఉంటుంది. అందులోనూ అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న క్రికెటర్స్ లో బయోపిక్స్ అంటే.. క‌చ్చితంగా హిట్టే.. ఇప్ప‌టికే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ మంచి స‌క్సెస్ ను సాధించాయి.

ఇక కపిల్‌ దేవ్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని ఇండియా విక్టరీ 83 పేరుతో సినిమాను రూపొందించారు. అయితే.. కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రికెటర్ బయోపిక్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.ఆ క‌థ ఎవ్వ‌రిదో కాదు.. ఇండియన్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న వ‌న్డే స్పెష‌లిస్ట్ బ్యాట్మెన్ యువరాజ్ సింగ్. యువీ కూడా తన బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ఇప్పటికే ఈ బయోపిక్‌కు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేసారట. మరి ఇందులో నటించబోయే హీరో ఎవరని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. గతంలో యువీ.. తన బయోపిక్ గురించి చెప్పిన‌ప్ప‌డు.. హృతిక్ రోషన్, రణభీర్ కపూర్‌లలో ఎవరొక‌రూ తన క్యారెక్టర్‌ను ప్లే చేసినా తనకు ఇష్టమని యువరాజ్ సింగ్ అన్నాడు.

కానీ.. యువీ ప్రతిపాదించిన ఇద్దరు స్టార్‌ హీరోలను కాదని కరణ్ జోహార్‌.. కొత్త ముఖం వైపు మొగ్గు చూపుతున్నాడని టాక్ . ఆ కొత్త ముఖం ఎవ్వరిదో కాదు .. యువ హీరో సిద్ధార్థ్‌ చతుర్వేది. ఈ యంగ్‌ హీరోను పెట్టి యూవీ బ‌యోపిక్ తీయ‌నున్న‌డ‌ని తెలుస్తుంది. కానీ, స్టార్ హీరోలను పెట్టి తీస్తే.. ఈ బయోపిక్ తొందరగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే మరికొంద‌రి వాదన.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో యువ‌రాజ్.. నిజ జీవితంలో పోరాడి గెలిచిన ఆంశాల‌ను తెర‌కెక్కించ‌నున్నారు క‌ర‌ణ్ ఇప్పటికే యువీతో చర్చలు కూడా జరిపారని టాక్. మ‌రోవైపు. గంగూలీ బయోపిక్ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version