రాష్ట్రంలో టిడిపి ప్రధాన కార్యాలయంపై అదేవిధంగా టిడిపి నేత పట్టాభి ఇంటిపై జరిగిన దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు నిరాహార దీక్షకు పూనుకున్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం వద్ద దీక్ష ప్రారంభించారు. ధ్వంసమైన సామాగ్రి మధ్యలోనే చంద్రబాబు దీక్షకు వేధికను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటల 36 నిమిషాల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు.
చంద్రబాబు దీక్షకు మద్దతుగా పలు జిల్లాల నుండి పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు కార్యాలయానికి విచ్చేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబు 36 గంటల నిరసన నిరసన దీక్షకు కౌంటర్ గా వైసిపి సైతం దీక్షను చేస్తోంది ఈరోజు రేపు వైసిపి ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో సవాళ్లు ప్రతిసవాళ్లు తో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు.