సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖ కృతజ్ఞతలు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లకు 40 శాతం మేరకు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలన్న అధికారుల నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలను సీఎం యథాతథంగా ఆమోదించారు.

ఈ పెంపుదల వల్ల రాష్ట్రంలో 7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరనుంది. కీలకమైన ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి ని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. దీపావళి పండుగ శుభ సందర్బంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వ‌స‌తి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌స‌తి గృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థ‌ల సొసైటీ  ప‌రిధిలోని విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version