ఏపీ : పోలీసు అమర వీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు సీఎం జగన్.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది వివరాలతో కూడిన అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం. ఆనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ లు ప్రకటించామన్నారు.
2017 నుంచి బకాయిలు ఉన్న 15 కోట్లు విడుదల చేశామని..భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామని ప్రకటన చేశారు. హోమ్ గార్డుల గౌరవ వేతనం పెంచామని..16వేల మంది మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్నామన్నారు.కోవిడ్ బారిన పడి మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇచ్చామని…పోలీసులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు ఆదేశించానని గుర్తు చేశారు. ఇది కూడా నవంబరు 30 లోపు చేపట్టాలని గడువు కూడా విధించానని పేర్కొన్నారు.
కొన్ని విషయాలను ప్రజల ముందు పెట్టాలని..నేర స్వభావాలు మారుతున్న ఈ కాలంలో వైట్ కాలర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఈ రాష్ట్రంలో నేరం కొత్త రూపాల్లో దాడి చేస్తోందని తెలిపారు. ఇటువంటి ఓ కొత్త రూపాన్ని గత రెండేళ్లుగా రాష్ట్రంలో చూస్తున్నామనిఅధికారం దక్కలేదని చీకట్లో గుళ్ళ పై దాడులు చేస్తున్నారని టీడీపి కి చురకలు అంటించారు సీఎం జగన్.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.