వైసీపీ సర్కారుపై మరోసారి ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీకి సైకో పాలన వద్దు, సైకిల్ పాలనే ముద్దు అని పేర్కొన్నారు చంద్రబాబు. జగన్ రెడ్డికి నాలుగేళ్ల తర్వాత బీసీలు గుర్తొచ్చారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. విజయడ వైసీపీ సభకు బీసీలను బలవంతంగా తీసుకొచ్చారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ సభకు రాకపోతే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బెదిరించారని మండిపడ్డారు. అదే సమయంలో, టీడీపీ సభలకు జనం స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు చంద్రబాబు.
జగన్ రెడ్డి తోకను త్వరలోనే కట్ చేస్తామని హెచ్చరించారు. ఇక, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఎదుర్కోలేక సంగం డెయిరీపై అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు చంద్రబాబు. సీఎం జగన్ రెడ్డికి సంగం వద్దంట… అమూల్ ముద్దంట అని చంద్రబాబు విమర్శించారు. సంగం రైతుల సంస్థ అని, అమూల్ గుజరాత్ సంస్థ అని అన్నారు చంద్రబాబు.
గుంటూరులో హత్యకు గురైన వైద్య విద్యార్థిని తపస్వి తల్లిదండ్రులను పరామర్శించినట్లు చంద్రబాబు తెలిపారు. కుమార్తె మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులు సీతారత్నం, పి.మహేష్ కుమార్‌లతో ఫోన్ లో మాట్లాడి వారిని ఓదార్చానని.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.