నేటి నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన..ఎన్టీఆర్‌ స్ఫూర్తి-చంద్రన్న భరోసా పేరుతో !

-

జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృత పర్యటనలకు నిర్ణయం తీసుకున్నారు బాబు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలోనూ పర్యటించనున్న చంద్రబాబు… జిల్లా పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలల్లో పాల్గొంటారు.

ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లా టూర్లు ఉండనుండగా.. ఇవాల్టి నుంచే ప్రారంభం కానున్నాయి చంద్రబాబు జిల్లాల పర్యటనలు. ఇవాళ చోడవరంలో 16,17 తేదీల్లో అనకాపల్లి, చీపురుపల్లి సెగ్మెంట్లల్లో పాల్గొననున్నారు.

మొదటి రోజు బహిరంగ సభ, రెండో రోజు పార్లమెంటులోని 7 అసెంబ్లీ ఇన్చార్జులతో సమీక్షలు, క్యాడరుతో ఆత్మీయ సమావేశాలు జరుగనున్నాయి. జిల్లా టూరులో మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షో ఉండేలా కార్యక్రమం ఉండనుంది. ఏడాదిలో 80కి పైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా సాగనున్న టిడిపి అధినేత పర్యటనలు కొనసాగనున్నాయి. ఎన్టీఆర్‌ స్ఫూర్తి-చంద్రన్న భరోసా పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటనలు కొనసాగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version