కెరీర్ విషయంలో మళ్లీ అలాంటి తప్పులే చేస్తున్న హీరో నాని..!!

-

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన సినిమాలు అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతూనే ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం నాని సినిమాలు అస్సలు బాగాలేవు అనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. నాని నటించిన పలు చిత్రాలు వరుసగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయని చెప్పవచ్చు. కథల విషయంలో నాని పొరపాటు చేస్తున్నాడని కామెంట్లు ఆయన అభిమానులు చేస్తున్నారు. ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్న పాత్రలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట.

ఇక గతంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన కొన్ని సినిమాలు కాస్తా ఫ్లాప్ గా మారాయని చెప్పవచ్చు. ఆ తరువాత హీరో నాని తెరకెక్కించిన టక్ జగదీష్ సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. కానీ ఓ టి టి లో విడుదల అయ్యి కాస్త ప్లస్ అయ్యింది. ఇక రొటీన్ కథ కావడంతో ఈ సినిమాకి పెద్దగా బజ్ ఏర్పడలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికి కూడా కమర్షియల్ గా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.

ప్రస్తుతం అంటే సుందరానికి సినిమాకి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది అంటున్నారు నెటిజెన్స్.. ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే కలెక్షన్లు సాధించిన అంటే సుందరానికి సినిమా వీకెండ్ తర్వాత ఊహించని స్థాయిలో కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. వరుస ఫ్లాపులతో నాని కెరీర్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గా కూడా కామెంట్ చేస్తున్నారు. నాని నటించబోయే తన తర్వాత చిత్రం బ్లాక్ బస్టర్ లిస్ట్ సాధించకపోతే నాని కెరియర్ చిక్కుల్లో పడినట్లే అన్నట్లుగా పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం తన తదుపరి చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకున్నారు. అయితే నాని కథ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కేవలం ఓకే చెబుతున్నారని వార్త వినిపిస్తోంది. ఇలా చేస్తే రాబోయే రోజులలో నాని కి ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version