అక్కడ జగన్ బలం పెరిగితే బాబుకి చుక్కలే…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నానా అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఆ పార్టీకి రాజకీయంగా ప్రస్తుత పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారాయి. నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడటం పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఇక ఇప్పుడు జగన్ ఎన్డియేలో చేరతారు అనే ప్రచారం చంద్రబాబుకి చుక్కలు చూపిస్తుంది. వాస్తవానికి కొన్ని రోజుల క్రితం వైసీపీని ఎన్డియే లో చేరమనే ప్రతిపాధన కేంద్రం నుంచి వచ్చింది.

శివసేన ఎన్డియే నుంచి బయటకు వెళ్ళడం అనేది బిజెపికి ఇబ్బందిగా ఉండటంతో ఆ కాళీని వైసీపీతో భర్తీ చెయ్యాలని ఎన్డియే భావించింది. దీనితోనే వైసీపీ కోసం ప్రయత్నాలు చేసారు. ప్రధాన కారణం ఏంటి అంటే, పెద్దల సభలో బిజెపికి బలం తక్కువగా ఉంది అది వచ్చే ఏడాది వైసీపీకి పెరిగే ఆరు రాజ్యసభ ఎంపీలతో భర్తీ చెయ్యాలి అనేది కేంద్రం ఆలోచన. అనేక బిల్లులను ఆమోదించాల్సి ఉండటంతో కేంద్రం వైసీపీ కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎన్డియేలో చేరినా చేరకపోయినా, రాజ్యసభలో జగన్ బలం పెరిగితే,

చంద్రబాబుకి తిప్పలు తప్పవు అంటున్నారు పరిశీలకులు. అప్పుడు సుజనా చౌదరి, సిఎం రమేష్ లకు బలం తగ్గిపోతుంది. వాళ్ళ మాట వినే కేంద్ర మంత్రులు కూడా పక్కకు తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కూడా బిజెపికి వైసీపీ తో వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవు. తెలుగుదేశం క్యాడర్ ని స్వేచ్చగా లాక్కోవచ్చు. తెలంగాణాలో కూడా తెరాస ఎన్డియే లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అది కూడా జరిగితే తెలుగుదేశం లాంటి బలహీనమైన పార్టీల అవసరం అనేది కేంద్రానికి తక్కువే. అందుకే చంద్రబాబులో ఇప్పటి న్న్చే ఆందోళన మొదలైందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version