యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన పెద్ద‌మ్మ‌..

-

యంగ్ రెబల్ స్టార్ గా అందరి మనసులూ దోచిన హీరో ప్ర‌భాస్‌. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కెరీర్ లో ముందుకు సాగుతున్న నటుడు. ప్రభాస్ గురించి చాలా విషయాలను మీడియాతో పంచుకుంది ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి. అందులో ఆయన వ్యక్తిగత విషయాలతో పాటు మోస్ట్ ఇంట్రెస్టెడ్ పెళ్లి విషయం కూడా ఉంది. అయినా ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌ర్ గ్రీన్ హాట్ టాపిక్ ప్ర‌భాస్ పెళ్లి. ఈయ‌న పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

దానికి తోడు ఈయ‌న పెళ్లి టాపిక్ కూడా డైలీ సీరియ‌ల్స్ కంటే దారుణంగా సాగుతుంది. తాజాగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ పెళ్లి అంశంపై స్పష్టత వచ్చింది. ప్రభాస్‌ పెద్దనాన్న కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి..ప్రభాస్‌ పెళ్లి గురించి అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‌ ప్రస్తుతం జాన్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా పూర్తవగానే ప్రభాస్‌ పెళ్లి పీటలెక్కుతాడని ఆమె స్పష్టం చేశారు. మ‌రియు ప్ర‌భాస్ పెళ్లి గురించి తాము కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నామ‌ని.. అత‌డి పెళ్లిపై వ‌చ్చే వార్త‌ల‌ను తాము స‌ర‌దాగా తీసుకుంటామ‌ని చెబుతుంది శ్యామ‌లా. ఏదైతేనేం.. ప్ర‌భాస్ పెళ్లిపై మాత్రం ఓ క్లారిటీ వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version