మానవత్వం లేని జగన్ పాలనకు నిదర్శనం : చంద్రబాబు

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కొవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడం మానవత్వం లేని జగన్ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల కొవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందన్నారు చంద్రబాబు. దారి మళ్లించిన నిధులను వెంటనే ఎస్డీఆర్​ఎఫ్​ ఖాతాలో జమ చెయ్యాలని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి ఇష్టానుసార పాలనకు చెంపపెట్టులాంటిదన్నారు. తప్పులు చేయటమే కాకుండా, వాటిని సమర్థించుకోవడం కోసం వైసీపీ కొత్త తప్పులు చేస్తోందన్న చంద్రబాబు.. కొవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను దారి మళ్లించడమేంటని ప్రశ్నించారు.

విపత్తులు వచ్చినప్పుడు అదనపు కేటాయింపులతో ప్రజలకు సాయం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇలా నిధులు మళ్లించి పబ్బం గడుపుకోవడం బాధితులకు అన్యాయం చెయ్యడమేనని విమర్శించారు చంద్రబాబు. కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. నాలుగు వారాల్లోగా ఫిర్యాదు పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెప్పకుండా అమలు చెయ్యాలన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version