బిగ్ బాస్ 6 ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన వైష్ణవి చైతన్య..!!

-

ఎవరైనా సరే బిగ్ బాస్ లో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే బిగ్ బాస్ లో అవకాశం వచ్చి..కంటెస్టెంట్ గా పాల్గొంటే చాలు విపరీతమైన అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా కష్టపడకుండా పాపులారిటీని సొంతం చేసుకోవచ్చు అన్న ఆలోచనతోనే చాలామంది బిగ్ బాస్ లో అవకాశం రావాలని కోరుకుంటారు. ఇక ఈ క్రమంలోనే చాలామంది బిగ్ బాస్ ఆఫర్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు కూడా బిగ్ బాస్ 6 లోకి రావడానికి అవకాశం లభించినట్లు తెలుస్తోంది.

నిజానికి యూట్యూబ్ ద్వారా పలు వీడియోలు చేస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకున్న వైష్ణవి చైతన్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె పలు షార్ట్ ఫిలిమ్స్, సాంగ్ ఆల్బమ్స్ తో పాటు వెబ్ సిరీస్ లు చేస్తూ విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక అడపాదడప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలలో నటించే ఈ ముద్దగుమ్మ బేబీ అనే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇకపోతే వెండితెరపై హీరోయిన్గా ఈమె నటిస్తున్న మొదటి చిత్రం బేబీ కావడంతో చాలా ఆశలు పెట్టుకుంది వైష్ణవి చైతన్య.

ఇకపోతే బేబీ సినిమా పూర్తయిన వెంటనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన వైష్ణవి చైతన్య బిగ్ బాస్ షో కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ఇక ఈసారి బిగ్ బాస్ 6 లోకి కామన్ మ్యాన్ ని కూడా పాల్గొనబోతున్నాడని నాగార్జున ముందే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కామన్ మ్యాన్ ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుండగా వైష్ణవి చైతన్య దీనిపై స్పందించి బిగ్బాస్ 6 లోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదు అని సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టలేను అని కూడా ఆమె తెలిపింది. ఇక ఆఫర్ ఇచ్చినా సరే బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ససేమిరా అని చెబుతోంది వైష్ణవి చైతన్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version