వైసీపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలే : చంద్రబాబు

-

వచ్చే ఏడాదిలో ఏపీలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. చంద్రబాబు ఇవాళ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ను చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని అన్నారు. మరో 6 నెలల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెలిపారు.

98 శాతం హామీలు అమలు చేశామంటూ వైసీపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. పథకాల్లో కోతలు విధించి కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు. ప్రజలపై రూ.50 వేల కోట్ల విద్యుత్ భారం మోపారని తెలిపారు. ఇన్ని తప్పులు చేసిన వ్యక్తికి ప్రజలు రుణపడి ఉండాలట అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

 

జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఏమిటో ప్రజలకు చెప్పాలని టీడీపీ శ్రేణులకు నిర్దేశించారు. ఈ నాలుగున్నరేళ్లలో ఏం
నష్టపోయారో ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలంతా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చేతివృత్తులు, కులవృత్తులకు అండగా ఉంటామని తెలిపారు. పేదలను ధనికులుగా మార్చడమే తమ పూర్ టు రిచ్ కార్యాచరణ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. బాబు ష్యూరిటీ… భవిష్యత్తుకు గ్యారెంటీ అనేదే మన నినాదం అని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. నిన్నిక భరించలేం… బై బై జగన్… ఇదే అందరి నినాదం ఆవాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version