రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉండొచ్చు.. సామాన్యులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు : చంద్రబాబు

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. తాజాగా చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా.. వ్యక్తులపై కక్షతో జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో భవనాలు, సదుపాయాలు, పరిశోధన కార్యక్రమాలు, బోధనా సిబ్బంది సహా అన్నీ బాగున్నాయి కానీ, ఇక్కడికి చేరుకునేందుకు సరైన రోడ్లు లేవని వర్సిటీ వ్యవస్థాక కులపతి డాక్టర్ టీఆర్ పారవేందర్ ఆవేదన వ్యక్తం చేసిన న్యూస్ క్లిప్‌ను షేర్ చేసిన చంద్రబాబు.. ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయడం సరికాదని అన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో జగన్ మొదటి నుంచి ఇదే చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతికి ప్రతిష్ఠాత్మకమైన వీఐటీ, ఎస్ఆర్ఎం వంటి విద్యా సంస్థలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబు.

 

మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారని పేర్కొన్నారు చంద్రబాబు. అలాంటి సంస్థలు రాజధానిలో ఉండకూడదని కనీసం రోడ్ల సదుపాయం కల్పించకపోవడం, మరమ్మతులు చేయకపోవడం దారుణమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. ఆయా సంస్థలకు వెళ్లడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు చంద్రబాబు. రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉండొచ్చు కానీ, అవి ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని హితవు పలికారు చంద్రబాబు. ఇటువంటి ఆలోచనలు రాష్ట్రానికి కూడా గౌరవం కాదని చంద్రబాబు అన్నారు చంద్రబాబు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version