టి20 ప్రపంచ కప్ ముందు ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. పెర్త్ వేదికగా ఆదివారం తొలి టీ 20 జరిగింది. ఇందులో భాగంగా ఇన్నింగ్స్ 14వ ఓవర్ లో డేనియల్ శామ్స్, ఫస్ట్ బంతిని స్లో డెలివరీ వేశారు. మిడాన్ షాట్ కొట్టిన స్టోక్స్, రెండు పరుగులు తీశాడు.
ఇక తర్వాత బంతి కూడా స్లో డెలివరీ ని స్టోక్స్ అనుకున్నాడు. రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. కాకపోతే ఈసారి శామ్స్, గుడ్ లెంత్ బంతి వేగంగా వచ్చింది. కాస్త లోపలికి టర్న్ అయింది. దీంతో స్టోక్స్ కి బాల్ కనెక్ట్ అవ్వలేదు. బదులుగా హెల్మెట్ దిగువ భాగంలో బంతి బలంగా తగిలింది.
దీంతో అప్పటికే రాబోయే ప్రమాదాన్ని ఊహించని స్టోక్స్ తప్పించుకునేందుకు ట్రై చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. దీంతో బంతి తగిలిన వేగానికి గాల్లో ఎగిరి కింద పడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఇంగ్లాండ్ టీం షాక్ అయింది. వెంటనే ఫీజియో వచ్చి స్టోక్స్ కి తగిలిన గాయాన్ని పరిశీలించాడు. అలానే బ్యాటింగ్ కొనసాగించిన ఇతడు, తొమ్మిది పరుగులతోనే అవుట్ అయి పైవిలియన్ బాటపట్టాడు. రివర్స్ స్వీప్ కి సంబంధించిన వీడియో ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. సరిగ్గా టి20 ప్రపంచ కప్ ఇలా జరగడం, జస్ట్ మిస్ కావడంతో ఇంగ్లీష్ జట్టు ఊపిరి పీల్చుకుంది.