విశాఖ చేరుకున్న జగన్, కాసేపట్లో చంద్రబాబు కూడా… !

-

ఆంధ్రప్రదేశ్ సాగర తీర అతిపెద్ద నగరం విశాఖలో గ్యాస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ లో ఈ గ్యాస్ లీక్ అయింది. దీనితో ఇప్పుడు పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్యం పలువురిది విషమంగా ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు విశాఖలో ఉంది.

సిఎం వైఎస్ జగన్ కూడా విశాఖ వెళ్ళారు. కాసేపట్లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించే అవకాశం ఉంది. పరిస్థితి ఇప్పటికే జగన్ కి అధికారులు వివరించారు. మంత్రి ఆళ్ళ నానీ తో కలిసి జగన్ విశాఖ వెళ్ళారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా విశాఖ పర్యటనకు వెళ్ళారు. ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర హోం శాఖకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు.

తాను విశాఖ వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా కేంద్ర హోం శాఖ తక్షణమే స్పందించింది. విశాఖ వెళ్ళ వచ్చు అని చెప్పడంతో చంద్రబాబు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా చంద్రబాబు విశాఖ వెళ్తారు. 2;30 నిమిషాలకు ఆయన విశాఖ వెళ్లనున్నారు. నేరుగా ఆస్పత్రులకు వెళ్లి బాధితులను పరామర్శిస్తారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version