విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై స్పందించిన సినీ ప్రముఖులు …!

-

అసలే కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తూ ప్రంచదేశాలని గడ గడలాడిస్తున్నవేళ మరో దుర్వార్త వినవలసి వచ్చింది. ‘విశాఖలో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం ప్రతీ ఒక్కరి మనసుని కలచివేస్తుంది. దేశంలో అనుకోని విపత్తులు సంభవిస్తూ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటం హృదయాలను కదిలిస్తోంది. ఈ ఘటనపై పలువు సినీ ప్రముకులు స్పందిస్తు తమ సానుభూతిని తెలియచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. లాక్‌డౌన్‌ అనంతరం తిరిగి పరిశ్రమలు ప్రారంభించే విషయంపై సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని మెగా స్టార్ చిరంజీవి ట్వీటర్ ద్వారా స్పదించారు.

 

ఇదే నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. వైజాగ్ గ్యాస్ లీక్ వార్తలు హృదయ విదారకంగా మారాయి. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న సవాలు సమయాల్లో గ్యాస్ లీకేజ్ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను వాళ్లంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్థున్నాన్నారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ..వైజాగ్ గాస్ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.

2020 ఎందుకింత కష్టంగా మారింది… నిద్ర లేచిన వెంటనే గ్యాస్ లీకేజీ వార్త విన్నాను. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా – మంచు మనోజ్, వైజాగ్ దుర్ఘటన దృశ్యాలు చూసి షాక్‌కు గురయ్యా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థకు గురైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా..అంటూ దర్శకుదూ అనిల్ రావిపూడి స్పందించారు. వీరితో పాటు దర్శకుడు రాజమౌళి, అఖిల్ అక్కినేని, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్.. లాంటి ప్రముఖులందరు స్పందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version