ప్రతి 5 ఏళ్లకోసారి లవర్‌ ను మార్చే..వీర ప్రేమికుడు చంద్రబాబు : విజయసాయి

-

వైసీపీ రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీపై ఏదో ఒక టాపిక్‌ ఎంచుకుని విమర్శలు చేస్తూ ఉంటారు విజయ సాయిరెడ్డి. అయితే.. తాజాగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి 5 ఏళ్లకోసారి లవర్‌ ను మార్చే..చంద్రబాబుకు శుభకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి.

“దేశంలోని ఎన్నో పార్టీలతో ప్రేమాయణం సాగించిన వీర ప్రేమికుడు చంద్రబాబు. ప్రతి ఐదేళ్లకోసారి లవర్ ను మారుస్తూ ఉంటాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ వీర ప్రేమికునికి శుభాకాంక్షలు.” అంటూ ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి.

“చంద్రబాబుని పిలిచి పీట వేసి, బొట్టు పెట్టలేదని సిగ్గుమాలిన మీడియా ఆధ్యాత్మిక గురువులపైనా విషం చిమ్ముతోంది. ధార్మిక సంస్థల సందర్శనకు ఆహ్వానాలు అవసరం లేదు. ఎవరైనా వెళ్లి రావచ్చు. పచ్చ మీడియా దృష్టిలో బాబు గారు దేవుడి కంటే ఉన్నతుడు. అందుకే అవమానంగా ఫీలవుతున్నట్టుంది.” అంటూ విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version