తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని నడిపించటానికి నానా తంటాలు పడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో కోలుకోలేని విధంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో…అతి తక్కువ స్థానాల తో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు. దీంతో సొంత పార్టీలో ఉన్న నాయకులు చంద్రబాబు ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదు. కొంతమంది నాయకులు అయితే ఏకంగా చంద్రబాబుని బండబూతులు తిడుతూ టిడిపి లోనే కొనసాగుతూ…అసెంబ్లీలో వైసీపీ కి మద్దతు తెలుపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో తెలుగుదేశం పార్టీలో అంతర్గత యుద్ధం నాయకుల మధ్య జరుగుతున్నట్లు దీంతో చంద్రబాబు తల పట్టుకుంటున్నటు వార్తలు వస్తున్నాయ.
డబ్బులు తీసినా గెలుపు ఖాయం కాదని ఒకవేళ గెలిచినా.. గెలుపొందిన వాళ్లు పార్టీలో ఉంటారో లేదో నమ్మకం కూడా లేదని ఫైనాన్షియల్ గా పార్టీకి వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికలలో టిడిపి తరఫున పోటీ చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ కామెంట్ ను తప్పు పడుతున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య పొలిటికల్ వార్ టిడిపిలో గట్టిగా ఉండటంతో టిడిపి అధినేత చంద్రబాబు తలపట్టుకుంటున్నారు అని పార్టీలో టాక్.