బ్రేకింగ్; రాజ్యసభ ఎన్నికలు వాయిదా…!

-

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేసే యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉందని అంటున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కట్టడి కోసం మార్చి 31 వరకు రాష్ట్రాలు అన్నీ కూడా దాదాపుగా లాక్ డౌన్ చేసారు. ఎన్నికలు వాయిదా వేయాలని సీఈసీ కి గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు లేఖలు రాసాయి. దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

మార్చి 26న జరగాల్సి ఉన్న రాజ్యసభ ఎన్నికలను వాయిదా వెయ్యాలని భావిస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఏకగ్రీవంగా సభ్యుల ఎంపిక అయ్యారు. ఏప్రిల్ 2,9,12 తేదీల్లో 55 మంది ప్రస్తుత రాజ్యసభ సభ్యల పదవీకాలం ముగియనుంది. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను… మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పేర్లను జగన్ ఖరారు చేసారు. వీళ్ళు దాదాపుగా ఎంపిక అయినట్టే. ఇక తెలంగాణా విషయానికి వస్తే ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, కే కేశవరావు ని ఎంపిక చేసారు. వీరు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎంపిక అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version