ఏపీలోఇప్పుడు అక్రమ అరెస్టుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇవే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు అరెస్టు అవుతారో తెలియక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. గత కొద్దికాలంగా వైసీపీ, టీడీపీ మధ్య ఈ అరెస్టుల చుట్టూ మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు నాయడు దీనిపై తన మార్కు చూపించారు.
ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు టీడీపీ నాయకులపై అక్రమ కేసు నమోదు చేసి, అరెస్టు చేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, ఆయన అనుచరులను అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి సమాచారం లేకుండా జనార్థన్ రెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేయడం దారుణమని చెప్పారు. అయితే అరెస్టు చేశాక జనార్దన్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిని మాత్రమే కోర్టులో హాజరు పరిచారని, మరో ఆరుగురు ఏమయ్యారంటూ ప్రశ్నించారు. వారిని బెదిరించి జనార్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించడానికి రహస్యం నిర్భంధించారంటూ ఆరోపించారు. ఇప్పుడు ఈ లేఖ తెగ వైరల్ అవుతోంది. మరి దీనిపై డీజీపీ ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా ఇప్పుడు రాజకీయాలు మరింత హాట్ టాపిక్‌గ మారుతున్నాయి.