పండుగ తరువాత అసలు సినిమా ఉంటుంది : చంద్రబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండగకు తమ సొంతూరు నారావారిపల్లెకు వెళ్లారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన.. మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు ఏది రాయమంటే అదే రాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ ఏడాది సంక్రాంతి భవిష్యత్తు మీద భరోసా కోసం పోరాడే శక్తినిస్తుందని చెప్పారు చంద్రబాబు. తన లెక్క ప్రకారం అర్హత లేని వ్యక్తులు వైసీపీ నాయకులంటూ మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో సేవా భావంతో పని చేసే వ్యవస్థ రాజకీయం అని చెప్పారు చంద్రబాబు. అధికార పార్టీ నాయకులు రౌడీయిజం, గూండాయిజం, హత్యలు, కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారని ఆరోపించారు చంద్రబాబు. తప్పులను కూడా పోలీసులు ద్వారా కప్పిపుచ్చుకోవాలని వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, తమపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సంక్రాంతి పండుగ తర్వాత తన పోరాటాన్ని మరింత స్పీడ్ పెంచుతానని చెప్పారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version