ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… ప్లాట్లు కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. ఏపీలో లేఔట్ లు అలాగే భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసే విషయంలో… రూల్స్… సరళీ తరం చేయబోతున్నట్లు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటన చేశారు.. ప్లాట్లు కొనుగోలు చేసేవారు.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూల్స్ పెడతామని… స్పష్టం చేశారు మంత్రి నారాయణ.
అదే సమయంలో పెట్టిన రూల్స్ ఎవరైనా ఉల్లంఘిస్తే… కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా విజయవాడలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయంలో… బిల్డర్ల అసోసియేషన్ ప్రతినిధులతో… ఏపీ మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వివాదాస్పదంగా ఉన్న ఆర్ 5 జోన్ అంశాన్ని కూడా… మంత్రి నారాయణ చర్చించారు.