ఏపీలో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా ఇలాంటి సమయలో పార్టీని కలిసికట్టుగా ముందుకు నడిపించాల్సిన నాయకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీలోనే కుమ్ములాటలు పెడుతున్నారు. టీడీపీలో పరస్పర ఫిర్యాదులు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. ఇక సొంత పార్టీ నేతలు చేస్తున్న పనులతో చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక అనంతపూర్ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అలాగే ఇదే జిల్లాకు చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వారు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు.
దీంతో అటు చంద్రబాబు కూడా వీరిని నేరుగా ఏమీ అనలేని పరిస్థితులు వస్తున్నాయి. ఇక జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పార్టీ ఓడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే చంద్రబాబు నాయకత్వాన్ని ఎవరూ నమ్మే పరిస్థితులు లేవని, కాబట్టి టీడీపీకి ఇప్పట్లో భవిష్యత్ ఉండదంటూ వ్యాఖ్యానించారు. ఇక అనంతపూర్‌కు చెందిన ఓ మాజీ మంత్రి కూడా ఇటీవల ఎమ్మెల్యే పెద్దారెడ్డిని కలవడం పెను సంచలనమే రేపింది.
వీరితో పాటు ఇంకా కొందరు కూడా ఇలాగే పార్టీని ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో వీరికి చెక్ పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారంట. లేకుంటే వీరితో ప్రమాదమేనని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా రీసెంట్ గా అనంతపురం పార్లమెంటరీ కమిటీని నియమించగా ఇందులో జేసీ బ్రదర్స్ అనుచర వర్గానికి స్థానం ఇవ్వలేదు. అలాగే కాల్వ శ్రీనివాసులు వర్గానికి కూడా ఇవ్వలేదు. ఇక త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నియమించే కమిటీల్లో పార్టీని ఇబ్బది పెడుతున్న వారి వర్గాలకు కాకుండా పార్టీకోసం పనిచేస్తున్న వారికి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారంట.