నేడు గుంటూరు మిర్చి యార్డ్ కు వైఎస్ జగన్.. ఈసీ అనుమతి నిరాకరణ

-

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైస్ జగన్ ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు మిర్చి యార్డును సందర్శించనున్నారని తొలుత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. అయితే జగన్ పర్యటనకు ఈసీ బ్రేకులు వేసిందనే చెప్పాలి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మిర్చి యార్డులోకి జగన్ కి అనుమతి లేకుండా ఈసీ నిరాకరించింది. అయినప్పటికీ మిర్చి రైతులను అడిగి తెలుసుకుంటామని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.

మిర్చీకి రేటు లేక అవస్థలు పడుతున్న రైతుల గోడు వినడానికి జగన్ వస్తున్నారని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతుంది. యార్డులో మిర్చి రైతులు దగా పడుతున్నారు. వరి, పత్తికి రేటు లేక రైతులు విలవిలలాడుతున్నారు. గతంలో 9వేలు పలికిన పత్తి ఇప్పుడు 4వేలకు కూడా కొనేవాడు లేడు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వమే రైతు దగ్గర ధాన్యాన్ని మేమే కొనుగోలు చేశాం. రైతాంగానికి భరోసా ఇచ్ఛామని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version