సీఈసీ నియామకం పై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

-

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జ్ఞానేష్ కుమార్ కి వ్యతిరేకంగా మంగళవారం సుప్రీంకోర్టు లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లతో పాటు 2023 చట్టం ప్రకారం.. సీఈసీ, ఈసీల నియామకాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల ను ఫిబ్రవరి 19న ప్రాధాన్యత ప్రాతిపదికన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సీఈసీ నియామక ప్రక్రియను సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సహా పలు సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించనున్నారు. 2023లో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సీఈసీ నియామకంలో పాటించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. సీఈసీ, ఈసీల ఎంపిక, నియామకాలు ప్రధాన న్యాయమూర్తి తో కూడిన కమిటీ ద్వారా జరుగుతాయని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. తాజాగా జరిగిన సీఈసీ నియామకం ఆ పద్ధతి లో జరగకపోవడంతో సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version