కాసేపటి క్రితమే టీడీపీ అధినేత ఎన్. చంద్ర బాబు నాయుడు.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పై ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడు. అలాగే… 8 పేజీల లేఖను ఆధారాల తో సహా రాష్ట్రపతి కి అందజేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ లో లిక్కర్ , డ్రగ్స్ మైనింగ్, సాండ్, మాఫియా విస్తరించిందని మండిపడ్డారు.
న్యాయ, మీడియా తో సహ అన్ని వ్యవస్థల పైన దాడులు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. ఏపీ లో మాదక మాదకద్రవ్యాల నెట్ వర్క్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తక్షణం ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని… అక్టోబర్ 19న జరిగిన ఘటనలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్న డీజీపీ నీ రీకాల్ చేయాలని రాష్ట్రపతిని కోరామని తెలిపారు చంద్ర బాబు.