ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ ప్రభుత్వంపై పీకల్లోతు కోపం ఉందని అందరూ అనుకుంటున్నా రు. అనుకుంటారు కూడా! అయితే, వాస్తవానికి ఆయనకు ఉన్న కోపం.. ఆవేదన అంతా కూడా ప్రజల ముం దు తనను తాను సమర్థించుకోవాల్సి వస్తోందనే! మరీ ముఖ్యంగా తన వారుగా.. తన కులపోళ్లుగా ఉన్నవా రు కూడా తనను ప్రజల మధ్య బందీ చేశారనే ఆయన ఆవేదన అంతా కూడా! ప్రస్తుతం ఆయన టీడీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులు, వైసీపీ ప్రభుత్వం పెడుతున్న కేసుల విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు రెడీ అయ్యారు.
ఈ క్రమంలోనే చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని టీడీపీ కార్యకర్త లను సమీకరించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అయితే, ఇదే సమయంలో వైసీపీ బాధితు లుగా ఉన్న ఇద్దరి విషయంలో మాత్రం చంద్రబాబు కినుక వహిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. వారిద్దరూ కూడా నిజానికి జగన్ ప్రభుత్వ బాధితులే. కాకపోతే.. చంద్రబాబు సొంత సామాజిక వర్గం అంతే!
ప్రస్తుతం చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న అక్రుత్యాలపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. కానీ, ఆ ఇద్దరిపై మాత్రం మౌనం వహించారు. ప్రస్తుతం ఇదే చర్చకు దారితీస్తోంది. అదే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ యరవతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాదరావులు వైసీపీ బాధితులుగా ఉన్నారు. ఇంకా చెప్పలంటే వీరిద్దరిలోనూ కోడెలది మరింద ఘోరం. ఆయన సొంత జిల్లా గుంటూరులోకి అడుగు పెట్టే పరిస్తితి కూడా లేకుండా పోయింది.
ఇక, యరపతినేని నెత్తిపై సీబీఐ కత్తి వేలాడుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి పక్షాన కూడా చంద్రబాబు పోరాటానికి దిగితే బాగుంటుందని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే సెంటిమెంటు ను పట్టుకుని వేలాడతామంటే.. బూమరాంగ్ అవుతుందనే విషయాన్ని చంద్రబాబు ఎందుకు మరిచిపోతున్నారో తెలియడం లేదని అంటున్నారు పరిశీలకులు.