టిడిపి అధినేత ప్రతిపక్షనేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళనకరంగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు,
ప్రస్తుతం కరోనా విపత్తు సమయంలో టెలిమెడిసిన్ ఆర్జివి ఉండి ఉంటే ఉపయోగపడేదని అభిప్రాయం వ్యక్తం చేసిన చంద్రబాబునాయుడు.. వైసీపీ ప్రభుత్వ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ విమర్శలు గుప్పించారు, రాష్ట్రవ్యాప్తంగా దళితులపై వైసీపీ నేతలు దారుణంగా దాడులకు పాల్పడుతున్నారని… 14 నెలల్లో 100 చోట్ల దళితులపై దాడులు జరిగాయి అంటూ మండిపడ్డారు.